ఆ 11 రోజులు ఎవరూ పుట్టలేదు, చనిపోలేదు.

మనం ఏ పని మొదలుపెట్టిన కేలండర్ లో  ఒక మంచి రోజూ చూసుకొని మొదలు పెడతాం. అలాంటిది ఆ కేలండర్ లో కొన్ని తేదీలు కనిపించక పోతే కాదు కాదు అసలు లేకపోతే ఎలా ఉంటుంది. ఏంటి నమ్మడం లేదా!? ఐతే ఒకసారి 1752 వ సంవత్సరం సెప్టెంబర్ నెల క్యాలెండర్ ని గూగుల్ చేసి చూడండి. అందులో 2 వ తేదీ తరువాత 14 వ తేదీ ఉంటుంది. షాక్ అయ్యారా!?. ఇదేంటి 2వ తేదీ తరువాత 3 నుండి 13 వరకు ఉండే తేదీలు ఏమైపోయాయి అనుకుంటున్నారా..ఇది తప్పుడు కేలండర్ కాదు .ప్రింటింగ్ పొరపాటు అంతకంటే కాదు.

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటానికి పట్టె కాలం ఒక సంవత్సరం అనగా 365 రోజులు అని మనం చిన్నపుడు పుస్తకాల్లో చదువుకున్నాం. 1582 వ సంవత్సరం లో  పొప్ 13వ గ్రెగొరీ అనే ఆయన ఈస్టర్ వచ్చే తేదీలలో తేడాని గమనించాడు.  అప్పట్లో అందరూ జ్యూసులిస్ సీజర్ కనిపెట్టిన జులియన్ క్యాలెండర్ ని ఉపయోగించేవారు. 

ఆ క్యాలెండర్ ప్రకారం ఒక సంవత్సరానికి అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగి రాయటానికి పెట్టె కాలం 365 రోజుల 6 గంటలు.12 వ శతాబ్దం లో టలోమీ ప్రకారం, 16 వ శతాబ్దంలో కోపర్నికాస్, 17 వ శతాబ్దం లో కెప్లెర్  సిద్ధాంతాల ప్రకారం భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి పట్టె కాలం 365 రోజుల 6 గంటల (365.25)కన్నా తక్కువ అని రుజువు చేశారు. 13వ గ్రెగోరి ఈ సిద్ధాంతాల ప్రకారం వాటి సరాసరిని లెక్కించగా భూపరిభ్రమనం కి పట్టే కాలం 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45 సెకన్లు(365.24219) అని తేలింది. ఇది జులియన్ చెప్పిన కాలం 365 రోజుల 6 గంటల కన్నా కొన్ని నిమిషాలు తక్కువ. అనగా  0.00781 రోజులు తక్కువ. అనగా జులియన్ క్యాలెండర్ తప్పుగా నిర్ణయించబడింది. ద్వేనిని 13 వ గ్రెగొరీ సారి చేసి ఒక కొత్త క్యాలెండర్ ని తయారు చేయాలని అనుకున్నాడు.

కానీ అప్పటికే 1300 సంవత్సరాల నుండి జులియన్ క్యాలెండర్ ని ఉపయోగిస్తున్నారు . కాబట్టి ఆ 1300 ని 0.00781 తో గుణించగా వచ్చిన ఫలితం 10.14 రోజులు(10) ని జులియన్ క్యాలెండర్ నుండి తీసేసి గ్రిగోరి ఒక కొత్త క్యాలెండర్ ని 1582 వ సంవత్సరం లో ప్రవేశ పెట్టారు. అందుకే 1582 అక్టోబర్ నెలలో 4 వ తేదీ తరువాత 15 వ తేదీ ఉంటుంది. అప్పట్లో ఈ మార్పుని అన్ని దేశాలు అంగీకరించాయి అనుసరించాయి . కాని కొన్ని బ్రిటిష్ దేశాలు అనుసరించలేదు. తరువాత 1752 లో మళ్ళీ గ్రెగోరి క్యాలెండర్ను అనుసరించారు.

కాకపోతే అప్పటికి కొన్ని సంవత్సరాలు గడవడం తో 1582 నుండి 1752 వరకు భేదం 170 సంవత్సరాల ని 0.00781 రోజులతో గుణించగా వచ్చిన 1.326 (1) రోజు మరియు 1582 లో తీసివేయాల్సిన 10 రోజులు మొత్తం 11 రోజులని గ్రెగోరియన్ క్యాలెండర్ లో సెప్టెంబర్ నెలలో (3వ తేదీ నుండి 13 వ తేదీ )తీసి వేసారు. కాబట్టి 1752 సెప్టెంబర్ నెలలో మనకి 2 వ తేదీ తరువాత 14 వ తేదీ వస్తుంది.ఆ 11 రోజుల్లో ఎవరు పుట్టినట్టు చనిపోయినట్టు రికార్డుల్లో ఉండదు.

Comments

Popular Posts

ఆమె చెప్పిన రహస్యం!!

చైనా వస్తువుల పై నిషేధం సాధ్యమా !?

ఆమె వంట తింటే ఇక అంతే! ఆమె ఎవరు?