ఆమె చెప్పిన రహస్యం!!

ఆస్ట్రేలియాలో ఆమె ఒక రచయిత. సాదా సీదా ఆర్టికల్స్ రాస్తూ ఉండేది. 55 సంవత్సరాల వయసులో ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తం ఒక సంచలం. విడుదల చేసిన ఏడాదిలోనే 19 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. 40 భాషల్లో ఆ పుస్తకాన్ని అనువదించారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా ఒక సినిమాని కూడా తీశారు. దాదాపు 6.56 కోట్ల డాలర్లు దాపు 500 కోట్ల రూపాయలు దాకా ఆ సినిమా కలెక్ట్ చేసింది. ఇంతకీ ఆ పుస్తకం ఏంటి తెల్సుకుందాం.!!

రోండా బైర్న్! 2005 సంవత్సరంలో ఆమె జీవితం అనుకోని మలుతిరిగింది. ఆమె ఆస్తిని కోల్పోయింది, మరియు తన తండ్రి చనిపోయారు. ఆమె అర్యోగం కూడా అంతట బాగాలేదు. అలాంటి స్థితిలో రోండా బైర్న్ పెద్ద కుమార్తె హేలీ ఒక పుస్తకం ఆమె కి ఇచ్చింది.అందులో సోక్రటీస్ ,అరిస్టాటిల్, ప్లాటో ,న్యూటన్ , థామస్ ఆళ్వా ఎడిసన్ మొదలైన గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలలోని కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆ పుస్తకం చదివిన రోండా బైర్న్ గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఎన్నో అవాంతరాలు ఎన్నో కష్టాలు పడిన తరువాతే విజయాన్ని సాధించారు అని తెల్సుకుంది. జీవితం లో అన్ని కోల్పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ జీవితాన్ని సున్నా నుండి మొదలు పెట్టారు అని తెల్సుకుని తానుకూడా తన జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి అని నిర్ణయించుకుంది. ఆలా నిర్ణయించుకొని తన కాలం లో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వ్యక్తుల జీవితాలని అధ్యాయనం చేయటం మొదలు పెట్టింది. వివిధ దేశాల లోని కవులు, తత్వవేత్తలు, గురువులు మొదలైన గొప్ప వాళ్ళ జీవిత విషయాలను వారు సాదించిన విజయాల వెనుక రహస్యాలను తెల్సుకొని ఒక పుస్తకం గా రాసింది.దీనిలో 10 చాఫ్టర్లు ఉంటాయి.

1. ది సీక్రెట్ రివీల్డ్

ఈ రహస్యం చాలా పాతకాలం లోనే ఉంది. అబ్రహం లింకన్ , ప్లాటో ,ఐన్ స్టీన్ ఇంకా మొదలైన వారు అనుసరించిన ఈ రహస్యాన్ని మొదటి చాఫ్టర్లోనే రోండా బైర్న్ మనకు చెప్పారు. ఈ రహస్యాన్ని ఉపయోగించి మనం ఏదైనా సాదించ వచ్చు అంటారు రోండా బైర్న్. ఉదాహరణకి డబ్బు సంపాదించాలన్న, పెద్ద ఇల్లు కట్టాలన్న, మంచి జాబ్ రావాలన్న ఈ రహస్యాన్ని సరిగా ఉపయోగిస్తే అది మనం సాధిస్తాం అని రచయిత్రి చెప్తారు.ఇంతకీ ఆ రహస్యం ఏమిటి అంటే లా అఫ్ అట్రాక్షన్ అనగా ఆకర్షణ సిద్ధాంతం. మనం ఏది అనుకుంటే అది మనకి దక్కుతుంది అని ఈ సిద్దాంతం చెప్తుంది. ఉదాహరణకి మనం డబ్బుసంపాదించాలి అనే ఆలోచన బలంగా ఉంటె ఆ డబ్బు మనల్ని ఆకర్షిస్తుంది. తీరా డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బులు పోతాయేమో అనే ఆలోచనల్లో ఉంటె మెల్లగా ఆ డబ్బు కరిగిపోతుంది. డబ్బు అంటా పోయిన తరువాత భయం ఉండదు కాబట్టి మళ్ళీ డబ్బులు సంపాందించాలి అనే కోరిక బలంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ డబ్బులు సంపాదిస్తారు. అంటే ఏదైనా మన ఆలోచనలు బట్టే ఆ ఆకర్షణ సిద్ధాంత ప్రభావం కూడా ఉంటుంది అని రచయిత్రి చెప్తారు. ఈ లా అఫ్ అట్రాక్షన్ కి పాజిటివ్ మరియు నెగటివ్ అనే బేధం ఉండదు మన ఆలోచనలు ఎలా ఉంటె అలానే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలతో ఉండడం మంచిది.

2. ది సీక్రెట్ మేడ్ సింపుల్

లా అఫ్ అట్రాక్షన్ కి మంచి చేదు అనే భేదం లేదు. మన ఆలోచనలకూ తగ్గట్టు గానే ఆ సిద్ధాంత ప్రభావం ఉంటుంది. మనకు దాదాపు రోజుకి 60 వేల ఆలోచనలు వస్తాయి అని పరిశోధకులు చెప్తారు. మనం ఎలా ఫీల్ అవితే ఆలోచనలు అలానే ఉంటాయి. కానీ కొన్ని ఫీలింగ్స్ మన కంట్రోల్ లో ఉండవు.కానీ వాటినుండి మనం డైవర్ట్ అవ్వడానికి పుస్తకాలు చదవటం, పాటలు వినడం, ఏదోఒక పని చేస్తూ ఉండటం చేయాల్సి ఉంటుంది. దాని వల్ల నెగటివ్ ఆలోచనలను కంట్రోల్ చేసుకోవచ్చు. ఎల్లప్పుడూ పాజిటివ్ ఫీలింగ్స్ తెచ్చుకోడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకి మనం పొద్దున్న లేవగానే ఒక నెగటివ్ ఆలోచన కాని, చిరాకు కలిగించే విషయం మన మైండ్ లోకి వస్తే ఆరోజు అంతా చిరాకుగానే ఉంటుంది. ఆలా కాకుండా పొద్దున్న లేవగానే ఒక చిరునవ్వుతో రోజు మొదలు పెడితే ఆ రోజు అంతా ఉత్సాహంగా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది.

3. సీక్రెట్ ని ఎలా ఉపయోగించాలి

ఈ సీక్రెట్ ని ఉపయోగించాలి అంటే మనం మూడు పనులు చెయ్యాలి అని చెప్తారు రోండా బైర్న్. మొదటిది : అసలు మనకు ఏమికావాలి అని మనల్నిమనమే ప్రశ్నించుకోవాలి.ప్రశించుకున్నాక ఏమి కావాలో అనేది క్షుణ్ణంగా ఒక పుస్తకం లో రాయాల్సి ఉంటుంది, అది కూడా వర్తమానం లో రాయాలి. ఉదాహరణకి మనకి ఒక పెద్ద ఇల్లు కొనాలి అనే కోరిక ఉంది అనుకోండి. దానిని ఇల్లుకొంటున్నాను అని రాయాలి. ఇంటికి సంబందించిన వివరాలు డబల్ బెడ్ రూమ్ , లేదా డూప్లెక్స్ మరియు ఇంటికి వేసే రంగు అన్ని ఆ పుస్తకం లో రాయండి. ఇలా చేయడం వల్ల మనకి ఏమి కావాలో అనేది మనం క్లియర్ గా ఉన్నాము అని మనకి తెలుస్తుంది. అలాగే ఈ విశ్వాన్నికి మన ఆలోచనని చెప్పినట్లు అవుతుంది. రెండవది: నమ్మకం. మనకి ఎం కావాలో అది మనకి వస్తుంది అని మనం బలంగా నమ్మాలి. ఎంతలా నమ్మాలి అంటే ఏమాత్రము అనుమానించకూడదు, అసలు మనం కోరుకుంది లభిస్తుందా ఎంత కాలం పడుతుంది అనే ఆలోచనలు పెట్టుకోకూడదు. కాబట్టి అది మనకి ఎలా ఐనా వస్తుంది అని మనం బలం గా నమ్మాలి. మూడవది : స్వీకరించటం. ఒకవేళ భవిష్యత్తులో మనం కోరుకుంది వచ్చింది అనుకోండి అపుడు మనం ఎలా ఐతే ఫీల్ అవుతామో ఎంత ఆనందం గా ఉంటామో అదే ఫీలింగ్ తో ఇప్పుడు కూడా ఉండాలి. అంటే ఆ కోరిక తీరాక వచ్చే ఫీలింగ్ ని ఇప్పుడే క్రియేట్ చేసుకోవాలి.

4. కృతజ్ఞతా భావం

మనకి ప్రస్తుతం ఉన్న వాటికి మనం కృతజ్ఞతాభావతో ఉండాలి. ఉదాహరణకి మనకి ఉన్న ఇల్లు, కారు,మనకి వస్తున్న సంపాదనకు కృతజ్ఞతభావం కలిగి ఉండాలి. ఒక పిల్లవాడు చేసే చిన్న చిన్న విషయాలకే మనం మెచ్చుకుంటూ ఉంటె ఆ పిల్లవాడు అలాంటివే ఇంకా చేస్తాడు. ఇదే లాజిక్ ఈ కృతజ్ఞతా భావంకి వర్తిస్తుంది. మనం రోజు జరిగే మంచి పనులకి మనం కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. అలా ఉండటం వల్ల మన జీవితం లోకి మరిన్ని మంచి పనులు జరుగుతాయి. ఈ పుస్తకం లో రెండు కాన్సెప్ట్స్ చెప్పారు రోండా బైర్న్. ఒకటి స్టోన్ కాన్సెప్ట్. రోడ్డు మీద వెళ్తున్న ఒక వ్యక్తి కి ఒక రాయి కనిపించింది. అపుడు ఆటను ఆ రాయి తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ రాయిని ముట్టుకున్నా ప్రతిసారి అతను తనకు జరిగిన ప్రతి మంచి పనికి థాంక్స్ చెప్పడం మొదలు పెట్టాడు. అలా చేస్తూ కొన్ని రోజులకి తన జీవితంలో మంచి విషయాలు జరగటం గమనించాడు. రెండవ కాన్సెప్ట్ విజువలైజషన్. అంటే మన కోరికని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అని మనం ఫీల్ అవగలగాలి. ఉదాహరణకి మీకు ఒక కారు కొనాలి అనే కోరిక ఉన్నపుడు, మీరు కారు కొని దాన్ని డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అవగలగాలి. అంటే కాని నాకు కారు లేదు ఉంటె బాగుండు అని భాదపడకూడదు.

5. సీక్రెట్ టు మనీ

జాగ్ కాన్ఫిల్ అనే రచయిత జీవితంలో జరిగిన కొన్ని సంగటనలు ఇందులో వివరించారు. అతను సంవత్సరానికి 8 వేల డాలర్లు సంపాదించే వాడు. ఈ రహస్యం తెలుసుకున్నాక అతను లక్ష డాలర్లు సంపాదించాలి అని నిర్ణయించుకున్నాడు. సంపాదించగలను అని గట్టిగా నమ్మాడు.అలా నెల రోజులు గడిచాయి కాని ఏమి మార్పులేదు. తరువాత తాను ఎప్పుడో రాసిన పుస్తకాన్ని ప్రచురించాలి అనే ఆలోచన అతనికి వచ్చింది వెంటనే ఒక లక్ష కాపీలు ముద్రించి అమ్మాడు. దానికి అతనికి దాదాపు 90 వేల డాలర్లు వచ్చాయి.ఇదే ఫార్ములాతో అతను 10 లక్షల డాలర్లు సంపాదించాలి అనుకోని ఆ డబ్బుని అతను పొందగలిగాడు. అతను రాసిన పుస్తకం " ది చికెన్ సూప్ ఫర్ ది సోయే". దీని తరువాతా అతను రాసిన అన్ని పుస్తకాలు చాల బాగా అమ్ముడు పోయాయి. అతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో నమోదు అయ్యింది. కాబట్టి డబ్బు సంపాదించాలి అంటే సంపాదించగలం అనే ఆలోచనల్లో ఉండాలి , సంపాదించలేను నా వల్ల కాదు అనే ఫీలింగ్స్ ఉండకూడదు.

6. ది సీక్రెట్ టు రిలేషన్

ఒక అమ్మాయి తన లైఫ్ లోకి వచ్చే అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది. తనతో లైఫ్ షేర్ చేసుకునే అబ్బాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఒక పేపర్ మీద రాసుకుంది.సరిపడే అంత డబ్బు సంపాదిస్తూ ఉండాలి ,హ్యాపీ పర్సన్ అయి ఉండాలి , చిరాకు పడకూడదు అని కొన్ని క్వాలిటీస్ ఒక పేపర్ మీద రాసింది. కాని ఆమెకి అలంటి అబ్బాయి కొన్ని నెలలు గడిచిన దొరకలేదు. ఒకరోజు ఆమె కారు గ్యారేజ్ మధ్యలో పార్క్ చేసింది.కాసేపటికి ఆమె ఆలోచించగా ఆమె చేసిన పని ఆమె ఆలోచనలకి విరుద్ధం గ ఉంది అని అనుకుంది. అంటే తాను గ్యారేజ్ మధ్యలో పార్క్ చేస్తే తన పార్టనర్ కారు పార్క్ చెయ్యడానికి చోటు ఉండదు అని తిరిగి వచ్చి పక్కకి పార్క్ చేసింది.తాను వాకింగ్ కి వెళ్లేటపుడు తన పర్నేర్ని పక్కనే ఉన్నట్టు ఉహించుకునేది. ఇలా కొన్ని వారాలకి తనకి నచ్చిన అబ్బాయి తన లైఫ్ లోకి వచ్చాడు. అతనిని పెళ్లి చేసుకొని హ్యాపీగ గడిపింది. కాబట్టి మనం చేసే పనులు మన ఆలోచనకి విరుద్ధం గ ఉండకూడదు. మనకి ఇష్టమైన వాళ్ళు మనకి కావాలి అంటే మనం హ్యాపీగా ఉండాలి అపుడు వాళ్ళు మనవైపు ఆకర్శించబడ్తారు.

7. ది సీక్రెట్ టు హెల్త్

మన ఆలోచనలు మరియు నమ్మకం ప్రభావం మన ఆరోగ్యం మీద చాల ఎక్కువగా ఉంటుంది. ప్లాసిబో ఎఫెక్ట్ దీని ప్రూవ్ చేసింది. తలనొప్పి వస్తున్న వ్యక్తికీ, తల నొప్పి మాత్ర అని చెప్పి ఒక షుగర్ పిల్ ఇస్తే అతనికి తలనొప్పి వెంటనే తగ్గిపోయింది. ఇది ఆ షుగర్ పిల్ వల్ల కాదు , ఆ మాత్ర వేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది అనే నమ్మకం వల్ల. దీన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అని అంటారు. కాబట్టి మనం ఆరోగ్యం గ ఉంటాము అని నమ్మాలి, ఒక వేల ఏదైనా అనారోగ్యం వస్తే తొందరగా నయం అయిపోతుంది అనే పాజిటివ్ ఆటిట్యూడ్ మరియు నమ్మకంతో ఉండాలి.

8. ది సీక్రెట్ టు ది వరల్డ్

ఈ విశ్వము , మనకి ఏది కావలిస్తే అది ఇస్తుంది అని రచయిత్రి చెప్తారు. కాకపోతే మనం గట్టి గ నమ్మాలి ఆ నమ్మకంతోనే ఉండాలి. ఉదాహరణకి బెలిజ్ అనే దేశం లో ఆయిల్ రిసోర్స్స్ కోసం ప్రయత్నించిన కొన్ని కంపెనీలు అక్కడ ఆయిల్ సోర్స్స్ లేవని తేల్చాయి. కాని ఆ సంస్థలో పనిచేసే ఒక వ్యక్తి మాత్రం అక్కడ ఆయిల్ సోర్సెస్ ఉన్నాయని బలం గా నమ్మాడు. ఒక సంవత్సరం కాలం పాటు తవ్వకాలు జరిపారు. అతని నమ్మకాన్ని నిజం చేస్తూ అక్కడ ఆయిల్ రిసోర్సెస్ లభించాయి. ఇది అతని నమ్మకం వల్ల సాద్య పడింది. ఈ విశ్వము లో దొరకనిది ఏది ఉండదు అని ఇలాంటి కొన్ని ఉదాహరణలు నిరూపించాయి.

9. ది సీక్రెట్ టు యు

ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు అని అడిగితే కొందరు ఒక శక్తి అని, మరి కొందరు దేవుడు అని చెప్తారు. ఇంతకీ ఆ శక్తి కాని ఆ దేవుడు కాని మీరే అని చెప్తారు రచయిత్రి. మీరు ఒక పవర్ఫుల్ మాగ్నెట్ అని మీరు ఏది కావాలంటే అది ఈ విశ్వము మీకు ఇస్తుంది అని చేప్తారు. మీ నమ్మకం మరియి ఆలోచనల శక్తి ని సరైన విధంగా ఉపయోగిస్తే అద్భుతాలు జరుగుతాయి అని వివరించారు.

10. సీక్రెట్ టు లైఫ్

మీ జీవితం ఒక బ్లాక్ బోర్డు లాంటిది.మీ జీవితం ఎలా ఉండాలి అనేది మీరే రాయాలి. మీరు ఏ పనిని ప్రేమిస్తారో ఆ పనులే చేయండి. ఏది మీకు ఆనందాన్ని ఇస్తుందో ఆ పనులు చేయండి. మీరు ఎంత ఆనందంగ ఉంటె, లా అఫ్ అట్రాక్షన్ మీ జీవితం లోకి అన్ని ఆనందకరమైన విషయాలు తీసుకొస్తుంది.

ఇదే "ది సీక్రెట్" పుస్తకం లో ఆమె చెప్పిన రహస్యం.

ఇందులో చెప్పిన విషయాలు మనకి కొంచెం వ్యంగంగా అనిపిస్తాయి.అసలు ఇలాంటివి నిజ జీవితంలో సాధ్యం అవుతాయా అనే ప్రశ్న మనకి వస్తుంది. లాజికల్ గాను మరియు ప్రాక్టీకల్ గ ఆలోచించే వారికి ఈ విషయాలు చాలా స్టుపిడ్ గా కూడా అనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది, రచయిత్రి ఒకరి జీవితం మీద వారి ఆలోచనలు, వాళ్ళ మీద వాల్లకి ఉండే నమ్మకం బాగా ప్రభావం చూపుతాయని చెప్పారు.ఈ రహస్యం తెలుసుకున్నాక దానిని ఎలా ఉపయోగించాలి అనేది మీ ఇష్టం. అందరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాము.

Comments

Popular Posts

చందమామని చంపేద్దాం అనుకున్నారు !?

చైనా వస్తువుల పై నిషేధం సాధ్యమా !?