డిప్రెషన్ని దూరం చేద్దాం!
"పాపం అతను ఫలాన రోగం వచ్చి చనిపొయడంట, ఫలానా ఆమె రోడ్ అక్సిడెంట్లొ చనిపొయిందంట" అని మనం చాలా సార్లు వింటునే ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఫలానావ్యక్తి డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నాడు అని తరచు వింటున్నాం. ఈ డిప్రెషన్ కి గొప్పవాళ్ళు ఏమీ అతీతులుకారు. అవునులే మనుషులకైతే ఆ భేదాలు. రోగాలకి, మృత్యువుకి ఆ భేదాలుండవుగా మరి. పని ఒత్తిడి, అంతేకాక ఒకరి లైఫ్ స్టైల్ మరొకరితో పోల్చుకుంటు అనవసరపు ఆలోచనల అగాధంలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. సామాజిక మాధ్యమాలలో వందలకొద్ది ఫ్రెండ్స్ ఉన్నా, మనసువిప్పి మాట్లాడుకోటానికి మన బాధలు చెప్పుకోటానికి ఒక్క మనిషి దొరకకపోవటం ఆలోచించాల్సిన విషయం.
పెట్టిన ఫోటో కి లైక్స్ రాలేదని కొందరు, పక్కవాళ్ళులా బాగా బ్రతకాలేకపోతున్నాం అని ఇంకొందరు మనసులో ఆందోళన చెందుతున్నారు. కష్టానికి, భాదకి కొలమానం ఏముంటుంది.ఎవరి కష్టం వాళ్ళకి పెద్దదిగానే ఉంటుంది. కానీ మనలో సంతోషంగా బ్రతకాలి అనే ఆలోచన కన్నా, పక్కవాడి కంటే ఎక్కువ సంపాదించాలి అనే తపనే కనిపిస్తుంది. ఈ రేసులో అందరూ గెలవలేరు.అది అన్ని సార్లు కుదరకపోవచ్చు.ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. గెలవాలని రేసులో దిగాలి కానీ ఓడిపోయినా తీసుకోగలిగే ధైర్యం ఉండాలి.అలాంటి మనోధైర్యం ఉన్నవాళ్లే ఆటనైనా, జీవితన్నైనా నెగ్గుకు రాగలరు.
చదువు అయ్యి కొన్నేళ్లు గడిచినా ఉద్యోగం రాలేదని, వచ్చిన ఉద్యోగం పోయిందని, ప్రేమించిన వాళ్ళు దక్కలేదని ఇలా రకరకాల కారణాల వల్ల మనుషులు ఎవరూ తమ కష్టాన్ని చెప్పుకోక , చెప్పుకుంటే ఎక్కడ అవహేళన చేస్తారో అని బయపడి తమలో తాము కుమిలిపోయి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మాట్లాడుకుంటే సగం కష్టాలు తీరిపోతాయి అనే చిన్న ఫార్ములా మనం జీవితంలో పాటించాలి. కష్టం ఒకరితో చెప్పుకుంటేనే మనకి సహాయం దొరుకుతుంది కానీ, చెప్పకుండా మన స్నేహితులు కాదుకదా మన ఇంట్లో వాళ్ళుకూడా సహాయం చేయలేరు. కాలం అన్నిటికి సమాధానం చెప్తుంది. మన ప్రయత్నం మనం చేస్తూ ముందుకు సాగాలి. నచ్చిన పని చేసుకుంటూ, కావాల్సిన దానికి కోసం కష్టపడుతూ చిన్న చిన్న ఒడిదుడుకులు దాటుకుంటూ వెళ్ళాలి. మనకి నచ్చినట్టు బ్రతికే హక్కు మనకి ఉంది కానీ, ఆత్మహత్య చేసుకునే హక్కు మనకి లేదు. అది పరిష్కారం కాదు.
డిప్రెషన్ కి ఒకే ఒక్క మందు మనం రిఫ్రెష్ అవడమే. మన మనస్సుని రిఫ్రెష్ చేసుకోవాలి, మన ఆలోచనల్ని రిఫ్రెష్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకటే ఆలోచనల్లో ఉండటం వల్ల మనకి ఒరిగేది ఏమి ఉండదు.పుస్తకాలతో కాలం గడపడం, మాట్లాడుకోటమే మానేసిన మనం మళ్ళీ సరదాగా మాట్లాడుకోటం నేర్చుకుందాం. అనవసరపు అజ్ఞానాన్ని వదిలి , అవసరమయిన వాటి మీద ఆలోచనల్ని నిపుదాం. కష్టం వస్తే ఎదుర్కొవాలి కానీ జీవితాలను వదులుకోకూడదు. ఫీలింగ్స్ మరియు జ్ఞానం ఉన్నది మనుషులకి మాత్రమే. ఎదుటి వారి ఫీలింగ్స్ ని గౌరవిద్దాం. మనతో షేర్ చేసుకున్న వారిని వ్యంగంగా చూడకుండా మనవంతు సహాయం చేద్దాం. డిప్రెషన్ నుండి దూరం చేద్దాం , ఆత్మహత్యలని ఆపుదాం.
True lines srinu
ReplyDelete