చందమామని చంపేద్దాం అనుకున్నారు !?

అవును మీరు విన్నది నిజమే.చందమామని చంపేద్దాం అనుకున్నారు.ఇతనికేమైనా పిచ్చా! చందమామని చంపేయడం ఏంటి వీడి మొహం అనుకుంటున్నారా!?. "చందమామ రావే జాబిల్లి రావే " అని మనం పాడుకున్న ఆ చందమామని చంపేయడానికి ప్రయత్నాలు జరిగాయి.

1958 వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ దీనికి ప్రాజెక్ట్ A119 అనే పేరుతో రహస్యంగా ఈ దారుణానికి ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం చంద్రుని మీదకి ఒక న్యూక్లియర్ బాంబు పంపించి , అక్కడ ఆ బాంబుని పేల్చడం. దీని ద్వారా చంద్రుడిని ముక్కలు ముక్కలుగా చేయటం. ఇది చంద్రుని వల్ల భూమికి ఆపద ఉంటుంది అనుకోని చేసిన ప్రయత్నం కాదు. ఇది కేవలం అమెరికా మరియు సోవియెట్ యూనియన్ రష్యా మధ్య ఆధిపత్య పోరులో భాగంగా చేయాలనుకున్న ఒక పిచ్చి పని. అప్పట్లో సోవియెట్ యూనియన్ రష్యా అంతరిక్ష పరిశోధనలో ముందంజలో ఉండేది. ప్రపంచం మొత్తం రష్యా వైపు చూడసాగాయి. అది చూసి తట్టుకోలేని అమెరికా చంద్రుడిని పేల్చేసి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలి అనుకుంది.

లియోనార్డ్ రేఫల్ నాయకత్వంలోని పది మంది శాస్త్రవేత్తలు చికాగోలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లో ఈ ప్రాజెక్ట్ A119 యొక్క పరిశోధన జరిగింది.మొదటిలో ఈ ప్రాజెక్ట్ కోసం హైడ్రోజెన్ బాంబు వాడాలి అనుకున్నారు. కానీ అంత బరువైన వస్తువుని పైకి పంపడం కష్టం అని భావించి , 1.79 కిలో టన్ W25 అనే వార్ హెడ్ని ఉపయోగించాలి అని అనుకున్నారు. కానీ 1959 జనవరి లో యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రాజెక్ట్ ని ఆపేసింది. ప్రజలనుండి వ్యతిరేకత వస్తుంది అనే భయం మరియు ప్రయోగం లో ఏదైనా పొరపాటు జరిగితే ఆ న్యూక్లియర్ బాంబు భూమి మీద పడి పేలుతుంది అనే అనుమానాలతో ఈ ప్రాజెక్ట్ ని ఆపేసారు.ఒకవేళ ప్రాజెక్ట్ విజయవంతం అయ్యి చంద్రుని పేల్చేసి ఉంటె ఆ శకలాలు తిరిగి మన భూమి మీద పడేవి.అదే జరిగితే ఈ భూమి మీద చాలా ప్రాంతాలు కనుమరుగయ్యేవి.అపారమైన ప్రాణ నష్టం జరిగేది.ఆ విధ్వంసం ఊహకి కూడా అందదు. ఇదే రకమైన ప్రాజెక్ట్ కి సోవియెట్ యూనియన్ కూడా పథకం రచించింది కానీ అది కూడా ఆగిపోయింది. 

చంద్రుడిని పేల్చేయాలి అనే ఆలోచన ఇప్పటిది కాదు. ఎన్ని దశాబ్దాల నుండి దీనిపైన పరిశోధనలు జరుగుతున్నాయి. అప్పట్లో చంద్రుని మీదకి మానవుడు వెళ్ళటం అనేది అసలు ఊహకి కూడా సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ తో మనుషులు చంద్రుని మీదకి వెళ్లి వస్తున్నారు. అలాగే ఇంకా పెరుగుతున్న టెక్నాలజీ తో చంద్రుడిని పేల్చడం అనేది పెద్ద కష్టమేమి కాదు.ఏది ఏమైనా చంద్రుడిని పేల్చాలి అనుకోవడం ఒక పిచ్చి చర్యగానే చెప్పాలి.మన భూమికి సహజంగా ఉన్న ఉపగ్రహం చంద్రుడు. ఒకవేళ చంద్రుడు లేకపోతే రోజుకి 24 గంటలు నెలకి 30 రోజులు సంవత్సరానికి 365 రోజులుగా ఉండవు. సూర్య చంద్ర గ్రహణాలు ఉండవు. పున్నమి వెన్నెలలు ఉండవు. విశ్వములోని కొన్ని గ్రహశకలాలు భూమిని తాకకుండా కొంతవరకు చంద్రుడు కాపాడుతున్నాడు. సముద్రల్లోని అలలు లేచే ఎత్తు చంద్రుని వల్ల కంట్రోల్ చేయబడుతున్నాయి. ఒకవేళ చంద్రుడే లేకపోతే వేసవి , శీతాకాలం , వర్షకాలాల్లో  ఒక క్రమబద్దీకరణ ఉండదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే చంద్రుడు లేకుండా భూమి అనేది లేదు. 

మన భూమికి సూర్యుడు ఎంత అవసరమో చంద్రుడు అంతే అవసరం.అలాంటి చంద్రుడిని పేల్చేయాలని చేసిన ప్రయత్నం ఆగిపోవటం మన అదృష్టం.ప్రాజెక్ట్ A119 కి పనిచేసిన అప్పటి రీసెర్చ్ స్టూడెంట్ కార్ల్ సాగన్ యొక్క బయోగ్రఫీ కోసం రీసెర్చ్ చేస్తున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్ విషయాలు ప్రపంచానికి తెలిసాయి.

Comments

Popular Posts

ఆమె చెప్పిన రహస్యం!!

చైనా వస్తువుల పై నిషేధం సాధ్యమా !?

ఆమె వంట తింటే ఇక అంతే! ఆమె ఎవరు?