ఆమె వంట తింటే ఇక అంతే! ఆమె ఎవరు?

ఆమె పేరు మేరీ మల్లోన్.1869 సెప్టెంబర్ 23న ఐర్లాండ్ లో హుక్ స్టోన్ అనే గ్రామంలో జన్మించింది. 1883 లో యునైటెడ్ స్టేట్స్ కి వలస వచ్చింది . ఆమెకి వంట చేయడం చాలా ఇష్టం.అదే ఆమె వృత్తిగా చేసుకుంది.కాకపోతే ఆమె వండిన వంట తిన్నవారికి టైఫాయిడ్ వచ్చేది. కాబట్టి ఆమెకి టైఫాయిడ్ మేరీ అనే పేరు వచ్చింది. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటి అంటే ఆమెకి ఎప్పుడు టైఫాయిడ్ రాలేదు. టైఫాయిడ్ అప్పట్లో బాగా తీవ్రమైన వ్యాధిగా ఉండేది. 1900 లో టైఫాయిడ్ వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణాలు కనుగొన్నారు. బ్యాక్టీరియా వలన మరియు అపరిశుభ్రత వలన ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ అని తెలుసుకున్నారు. మేరీ మల్లోన్ టైఫాయిడ్ వ్యాప్తి చేసిన మొదటి మహిళగా గుర్తించబడింది. ఆమెకు టైఫాయిడ్ లేకపోయినా ఆమె వల టైఫాయిడ్ వ్యాప్తి చెందేది. కానీ దీనికి గల కారణం ఎవరి అంతుపట్టని విషయం. మరి మల్లోన్ కి కూడా ఈ విషయం మీద అవగాహన లేదు.అంటే మొదటిలో ఆమె ద్వారా టైఫాయిడ్ వ్యాప్తి జరుగుతుంది అని ఆమెకి కూడా తెలియదు.

1906 లో చార్లెస్ హెన్రీ వారెన్ అనే అతను ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. అతనిది సంపన్న కుటుంబం. న్యూయార్క్ లో బ్యాంకర్. దాదాపు 11 మంది వరకు వారి ఇంట్లో ఉండేవారు. మేరీ మల్లోన్ వంట మనిషిగా ఆ ఇంట్లో చేరింది. తరువాత కొన్ని రోజులకి వాళ్ళ ఇంట్లో ఆరుగురికి టైఫాయిడ్ వచ్చింది. చార్లెస్ ఇల్లు చాలా శుభ్రం గా ఉంచుకునే వారు. టైఫాయిడ్ వ్యాధి ఉనికి కూడా వారు ఉండే ప్రాంతం లో లేదు. అయిన కూడా తన ఇంట్లో వాళ్లకి టైఫాయిడ్ ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు. తన స్నేహితుడు జార్జ్ సోబెర్ కి ఈ విషయం చెప్పాడు. చార్లెస్ కుటుంబంలో టైఫాయిడ్ వచ్చిన వారం రోజులకి మేరీ మల్లోన్ ఉద్యోగం వదిలి వెళ్ళిపోయింది. పైగా ఆ కుటుంబంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తి మేరీ మల్లోన్ . దీనితో సోబెర్ కి అనుమానం వచ్చి ఆమె కోసం ఆరా తీశాడు. మేరీ ఎక్కడ ఎక్కువ కాలం పనిచేయదు అని తన ఉద్యోగం చేసే చోటు తరచు మారుతుంది అని కనుక్కున్నాడు. అంతేకాక తాను పని చేసిన ప్రదేశాలు లో టైఫాయిడ్ వ్యాపిస్తుంది అని కనిపెట్టి పోలీసులకి చెప్పాడు.

అపుడు పోలీసులు ఆమెని వెతికి పట్టుకొని, ఆమె ద్వారా టైఫాయిడ్ వ్యాప్తి జరగకుండా ప్రజలని కాపడటానికి ఆమెను న్యూయార్క్ సముద్ర తీరానికి శివారులో గల నార్త్ బ్రదర్ ద్వీపంలో బంధించారు. దాదాపు రెండు సంవత్సరాలు ఆమె మీద పరీక్షలు జరిపారు కానీ ఆమె ద్వారా టైఫాయిడ్ ఎలా వ్యాప్తి చెందుతుందో కనిపెట్టలేక పోయారు.తరువాత కొంత కాలానికి ఆమె ఈ శిక్షని తిరస్కరించింది. తనవళ్ళ టైఫాయిడ్ వ్యాపిస్తుంది అనేది అబద్దామని, తనలో టైఫాయిడ్ లక్షణాలు లేవని వాదించింది. టైఫాయిడ్ బాక్టీరియా తనలో లేదు అని డాక్టర్స్ చెప్పారని అయినా నన్ను ఇలా బందించడం అమానుషం అని తాను నిర్దోషినని, అయినా కూడా నన్ను క్రిమినల్ గా పరిగణిస్తున్నారు అని వాపోయింది. న్యూయార్క్ స్టేట్ బోర్డ్ ఆఫ్ హెల్త్ కు ఫిర్యాదు చేసింది. 1910 లో ఆమె మీద విచారణ జరిగింది.

దానితో ఆమె వంట చేయనని వేరే విధముగా జీవితం గడుపుతానని బోర్డ్ కి వివరించిందిం. ఆ వివరణ విన్న కోర్టు కొన్ని షరతులతో విడుదల చేసారు. కొన్నేళ్ళ మేరీ వంట చేయకుండా లాండ్రీ లో పని చేస్తూ జీవనం గడిపింది. కాకపోతే లాండ్రీ ద్వారా ఎక్కువ జీతం వచ్చేది కాదు. పైగా తనకి వంట చేయటం చాలా ఇష్టం కావడం తో ఆమె మళ్ళీ వంట చేయాలి అని నిర్ణయించుకుంది. వెంటనే చేస్తున్న లాండ్రీ పని వదిలేసి మళ్ళీ వంట పనికోసం వెతికింది. మేరీ మల్లోన్ , మేరీ బ్రౌని గా పేరు మార్చుకొని మాన్ హట్టన్ లోని స్లోన్ మెటర్నిటీ అనే మహిళ ఆసుపత్రిలో వంటమనిషిగా చేరింది. 1915 లో ఆ ఆసుపత్రిలోని 22 మంది డాక్టర్స్ మరియు నర్సులు టైఫాయిడ్ కి గురయ్యారు. ఇద్దరు డాక్టర్స్ చనిపోయారు. దీనితో పోలీసులు మళ్ళీ మేరీ ని అరెస్ట్ చేశారు. ఈసారి ఆమెని మనుషుల్లేని ద్వీపంకి తరలించారు . అక్కడ ఆమె దాదాపు 26 సంవత్సరాలు ఒంటరిగా బతికింది. 1938 లో ఆమె నిమోనియా తో చనిపోయింది. చనిపోడానికి ముందు ఆమెకి పక్షవాతం వచ్చింది.

కానీ ఆమె నుండి టైఫాయిడ్ ఎలా వ్యాప్తి చెందింది అనేదానికి ఇప్పటికి సరైన దాఖలాలు లేవు. కానీ కొంతమంది, ఆమె వంట చేసేముందు సరిగ్గా చేతులు శుభ్రం చేసుకొనేది కాదు అని అందుకే టైఫాయిడ్ వ్యాపించేది అని అనుకునేవారు. అలా మేరీ మల్లోన్ అలియాస్ మేరీ బ్రౌని , టైఫాయిడ్ మేరీగా చరిత్రలో నిలిచిపోయింది.

Comments

Popular Posts

ఆమె చెప్పిన రహస్యం!!

చైనా వస్తువుల పై నిషేధం సాధ్యమా !?