చైనా వస్తువుల పై నిషేధం సాధ్యమా !?

చైనా వస్తువులని నిషేదించాలి అనే నినాదం కొత్తది ఏమి కాదు. కొన్ని ఏళ్ళుగా ఎదో ఒక రకంగా చైనా మనదేశానికి వ్యతిరేకంగా పనులు చేస్తూ వచ్చింది. అది డోక్లామ్ వివాదం, చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం కానీ , ఈ మధ్య వచ్చిన వైరస్, ఇపుడు జరిగిన గాల్వాన్ వాలీ లో జరిగిన సంఘటనలు. ఇలా ఎన్నోరకాలుగా చైనా , భారత్ కి విరుద్ధంగా వ్యవహరించింది.అలాంటపుడు మనలో చైనా వస్తువులని బ్యాన్ చెయ్యాలి అనే నినాదం గుర్తుకొస్తుంది. 


కానీ చైనా వస్తువులని బ్యాన్ చేయడం సాధ్యమేనా!? ఈ ప్రశ్నకి భిన్నమైన సమాధానాలున్నాయి. చైనా వస్తువులని బ్యాన్ చేసి , ఆ వస్తువులని వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుందాం అపుడు చైనా వ్యాపారం దెబ్బతింటుంది , వాళ్లకి నష్టం వస్తుంది కాబట్టి మనం చైనా వస్తువులని బ్యాన్ చేద్దాం అని మనలో చాలా మంది అనుకుంటారు. కానీ ఇది అంత సులువైన పని కాదు. ఇప్పటికిప్పుడు జరిగిపోయే చిన్న విషయం కూడా కాదు. ఎందుకంటే చైనా కి భారత్ కి మధ్య 2014 లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం జరిగే ఎగుమతి దిగుమతుల వ్యాపారం విలువ 74.8 బిలియన్ డాలర్స్ అనగా 5 లక్షల కోట్లు. ఇప్పటి లెక్కల ప్రకారం సుమారు 7 లక్షల కోట్లు. 


దీనిలో భారత్ , చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువుల విలువ దాదాపు 5.4 లక్షల కోట్లు.చైనాకి ఎగుమతి చేసే వస్తువుల విలువ సుమారు 1.6 లక్షల కోట్లు. అంటే మనదేశం చైనా కి ఎగుమతి చేసే వస్తువుల కంటే దిగుమతి చేసుకునే వస్తువులే ఎక్కువ. కాబట్టి మనదేశంలో చైనా వస్తువుల్ని ఎక్కువగా వాడుతున్నాం. మన దేశం నుండి చైనాకి ఎగుమతి అయ్యే వస్తువుల్లో ఎక్కువ శాతం ప్రత్తి, రాగి, ఇనుప ఖనిజం , గ్రానైట్, లెథర్ ,టెలిఫోన్ సెట్స్ , మరియు కొన్ని వెజిటబుల్ ఆయిల్స్ ఉంటాయి. చైనా నుండి దిగుమతి చేసుకునే వాటిలో ఎక్కువ శాతం మొబైల్స్ ,ఎలక్ట్రానిక్స్ ,ఎరువులు, మెడికల్ ఎక్విప్మెంట్, ప్లాస్టిక్స్ ,ఆర్గానిక్ కెమికల్స్ ఉంటాయి.

 చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులు ఇప్పటికిప్పుడు ఆపేస్తే మనం వేరే దేశాల నుండి ఆ వస్తువులని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వేరే దేశాలు చైనా ఇచ్చే ధరకే ఆ వస్తువులు ఇస్తాయి అని అనుకోడానికి లేదు. ఎందుకంటే ప్రపంచం లో తయారు అయ్యే మొత్తం వస్తువులలో దాదాపు 28 నుండి 30 శాతం వస్తువులు చైనా లోనే తయారవుతున్నాయి.అందులోను వేరే దేశాలతో పోలిస్తే చైనా లోనే ఆ వస్తువులు తక్కువ ధరకి లభిస్తాయి.అందుకే చాలా దేశాలు చైనానుండే వస్తువులు దిగుమతి చేసుకుంటాయి.


  • భారత్ దిగుమతులు 

  •  మన దేశం లోనే కొన్ని వస్తువులని తయారు చేయడానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టెక్నాలజీ కానీ మనకి ఇంకా అందుబాటులో లేదు. ఒకవేళ ఉన్నా ఆ పరిశ్రమలని స్థాపించి ఆ వస్తువులు తయారు చేయడానికి దాదాపు 3 నుండి 5 సంవత్సరాలు పడుతుంది. కానీ అప్పటి వరకు మనం వేరే దేశాలు మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆర్థిక సంవత్సరం 2019 -20 లో చైనా మరియు భారత్ ల మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలు ఇలా ఉన్నాయి. భారతదేశం ప్రపంచ దేశాలనుండి చేసుకున్న దిగుమతులలో 14 శాతం చైనా నుండే. అలాగే భారత్ ఎగుమతులలో 5.3 శాతం చైనా దేశానికే ఎగుమతి అవుతున్నాయి. అలాగే ఇండియా మొబైల్ మార్కెట్లో అధిక శాతం 30 తో షియోమీ ,17 శాతం తో వివో , 14 శాతం తో రియల్ మీ బ్రాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ చైనా సంస్థలే అని మనకి తెల్సిన విషయమే.    

    అంతే కాక ఇప్పుడు మనం వాడుతున్న టీవీ, ఫ్రిడ్జ్ , ఏసీ, లాప్ టాప్ , కంప్యూటర్స్ మరియు ఇతర వస్తువులు అన్ని చైనా లో తయారు అయ్యినవే. వీటి మీద బ్యాన్ విదిస్తే ఇక్కడ వాటితో వ్యాపారం చేసే వ్యాపారు అందరు నష్టపోతారు. వేరే దేశాలనుండి ఆ వస్తువులుని ఎక్కువ ధరకి దిగుమతి చేసుకోటం వల్ల సామాన్యులు మధ్యతరగతి వారు ఆ వస్తువులు కొనలేనంతగా ధరలు పెంచాల్సి వస్తుంది. అంతే కాక మనం బ్యాన్ చేసినట్టు గానే చైనా కూడా ఇండియన్ ప్రొడక్ట్స్ మీద బ్యాన్ విదిస్తే అపుడు నష్టపోయేది మనమే. ఎందుకంటే చైనా మనదేశం నుండి దిగుమతి చేసుకునే వస్తువులు 1 శాతం మాత్రమే. వాటిని మనదేశం నుండి కాకపోతే వేరే దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది. కానీ ఆ వస్తువులు మనం ఎగుమతి చేయడానికి వేరే దేశాలకి తక్కువ ధరకి ఎగుమతి చేయాల్సి రావచ్చు. 

  • భారత్ ఎగుమతులు 

  • చైనాతో గొడవ జరిగినపుడల్లా మనం చైనా వస్తువులని బ్యాన్ చెయ్యాలి అని ఒక నిర్ణయానికి వస్తాం. కానీ నిజానికి చైనా వస్తువులని నిషేధించాలి అంటే పైన చెప్పిన విషయాలుని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అది అంత సులభమైన నిర్ణయం ఐతే కాదు. దానిలో సాద్య అసాధ్యాలుని గమనించాలి.


    కానీ అది సాధ్యం చేయాలి అంటే ముందుగా మనదేశం నుండి ఎగుమతులు పెంచాలి , దిగుమతులు తగ్గించాలి. ముఖ్యంగా చైనా దేశం నుండి తగ్గించాలి. అదే వస్తువులు మన దేశంలో తయారు చేసేలా కొత్త సంస్థల్ని, స్టార్టుప్ లని ప్రోత్సహించాలి. వాటికి కొన్ని రాయితీలు ఇవ్వాలి.అలాగే మనదేశం లో ఇన్నోవేషన్ మరియు రీసెర్చ్ కి ఎక్కువ ప్రాముఖ్యతని ఇవ్వాలి. అలాగే దేశం లో విద్యా విధానానికి ప్రాక్టీకల్ అప్రోచ్ ని తీసుకు రావాలి. ఇలా చేస్తే నాణ్యమైన విద్య ని యువత అందుకుంటుంది. అపుడు మనమే కొత్త పద్ధతులు ఇన్నోవేషన్స్ చేయవచ్చు. ఇలా చేయటంవల్ల ఇప్పటికిప్పుడు కాకపోయినా కొన్ని సంవత్సరాల తరువాత మనం మనదేశం తయారు చేసే వస్తువుల పైనే ఆధారపడతాం. వేరే దేశాలకి మనమే ఆధారం అవుతాం. అపుడు భారతదేశం ఒక స్వతంత్ర శక్తిగా ఎదుగుతుంది.

    భారత సరిహద్దుల్లో ప్రాణాలు త్యాగం చేసిన జవాన్ లకు నివాళులు అర్పిస్తూ..

    జై హింద్!!

    Comments

    Popular Posts

    ఆమె చెప్పిన రహస్యం!!

    ఆమె వంట తింటే ఇక అంతే! ఆమె ఎవరు?