"పాపం అతను ఫలాన రోగం వచ్చి చనిపొయడంట, ఫలానా ఆమె రోడ్ అక్సిడెంట్లొ చనిపొయిందంట" అని మనం చాలా సార్లు వింటునే ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఫలానావ్యక్తి డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నాడు అని తరచు వింటున్నాం. ఈ డిప్రెషన్ కి గొప్పవాళ్ళు ఏమీ అతీతులుకారు. అవునులే మనుషులకైతే ఆ భేదాలు. రోగాలకి, మృత్యువుకి ఆ భేదాలుండవుగా మరి. పని ఒత్తిడి, అంతేకాక ఒకరి లైఫ్ స్టైల్ మరొకరితో పోల్చుకుంటు అనవసరపు ఆలోచనల అగాధంలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. సామాజిక మాధ్యమాలలో వందలకొద్ది ఫ్రెండ్స్ ఉన్నా, మనసువిప్పి మాట్లాడుకోటానికి మన బాధలు చెప్పుకోటానికి ఒక్క మనిషి దొరకకపోవటం ఆలోచించాల్సిన విషయం. పెట్టిన ఫోటో కి లైక్స్ రాలేదని కొందరు, పక్కవాళ్ళులా బాగా బ్రతకాలేకపోతున్నాం అని ఇంకొందరు మనసులో ఆందోళన చెందుతున్నారు. కష్టానికి, భాదకి కొలమానం ఏముంటుంది.ఎవరి కష్టం వాళ్ళకి పెద్దదిగానే ఉంటుంది. కానీ మనలో సంతోషంగా బ్రతకాలి అనే ఆలోచన కన్నా, పక్కవాడి కంటే ఎక్కువ సంపాదించాలి అనే తపనే కనిపిస్తుంది. ఈ రేసులో అందరూ గెలవలేరు.అది అన్ని సార్లు కుదరకపోవచ్చు.ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. గెలవాలన...