మయసభలో ఓ మగువ!
"ద్రౌపది చీర లాగినపుడు కృష్ణుడు వచ్చి కాపాడాడు.కాపాడినపుడు కొంతమందే సంతోషించారు.వివస్త్రగా ఉన్న ద్రౌపదిని చూడలేకపోయామని చాలామంది బాధపడ్డారు. భాదపడినవాళ్ళు అందరూ కురుక్షేత్రంలో చచ్చారు.మయసభలో ద్రౌపది మీద శారీరకంగా కాకపోయినా,మానసికంగా అత్యాచారం జరిగింది.కాపాడే కృష్ణులు కొంతమందే,కావాలనుకునే కీచకులు కోకొల్లలు". ప్రతిసారి కృష్ణుడు రాడు. నేను ద్రౌపదినీ కాను. అలా కటకటాల వెనుక ఒక చోట కూర్చొని పుస్తకంలో రాస్తూ ఉన్న ఆమె మోములో విచారం మరియు ఆనందం . సముద్రపు అంచున వీక్షించే సూర్యోదయం ఆమె కనుల్లో కనిపిస్తుంది. కళ్ళలో నీళ్లు ఒక వైపు , ఆమె చూపులో వెలుగు కలిపి ఒక హరివిల్లు. గర్వంతో అలకరించబడ్డ అధరం. ఆర్తితో ఎండిపోయిన గరళం. అంతలో పక్కనే ఉన్న కుండలో నీళ్లు తీసుకుని తాగింది. నేలపైన దుప్పటి కప్పుకొని నిద్రపోబోతున్న ఆమెను ఒక ఆలోచన నిద్రపోనివ్వలేదు. ఎన్నో ఆశలతో ఆమె, గుండె నిండా బాధతో వాళ్ళ అమ్మ నాన్న సొంత ఊరు నుండి పట్నం వచ్చారు.చెప్పులు కూడా లేకుండా పొలం లో పనులు చేసే వాళ్ళ నాన్న, ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరిగే వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. ఎన్నో ఆశయాలతో పట్నం వచ్చిన ఆమె, ఉద్యో...