Posts

Showing posts from June, 2020

ఆమె చెప్పిన రహస్యం!!

Image
ఆస్ట్రేలియాలో ఆమె ఒక రచయిత. సాదా సీదా ఆర్టికల్స్ రాస్తూ ఉండేది. 55 సంవత్సరాల వయసులో ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తం ఒక సంచలం. విడుదల చేసిన ఏడాదిలోనే 19 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. 40 భాషల్లో ఆ పుస్తకాన్ని అనువదించారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా ఒక సినిమాని కూడా తీశారు. దాదాపు 6.56 కోట్ల డాలర్లు దాపు 500 కోట్ల రూపాయలు దాకా ఆ సినిమా కలెక్ట్ చేసింది. ఇంతకీ ఆ పుస్తకం ఏంటి తెల్సుకుందాం.!! రోండా బైర్న్! 2005 సంవత్సరంలో ఆమె జీవితం అనుకోని మలుతిరిగింది. ఆమె ఆస్తిని కోల్పోయింది, మరియు తన తండ్రి చనిపోయారు. ఆమె అర్యోగం కూడా అంతట బాగాలేదు. అలాంటి స్థితిలో రోండా బైర్న్ పెద్ద కుమార్తె హేలీ ఒక పుస్తకం ఆమె కి ఇచ్చింది.అందులో సోక్రటీస్ ,అరిస్టాటిల్, ప్లాటో ,న్యూటన్ , థామస్ ఆళ్వా ఎడిసన్ మొదలైన గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలలోని కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆ పుస్తకం చదివిన రోండా బైర్న్ గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఎన్నో అవాంతరాలు ఎన్నో కష్టాలు పడిన తరువాతే విజయాన్ని సాధించారు అని తెల్సుకుంది. జీవితం లో అన్ని కోల్పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ జీవితాన్ని సున్నా నుండి మొదలు పెట్టారు అని తెల్సుకుని తానుకూడా తన జీ...

ఆమె వంట తింటే ఇక అంతే! ఆమె ఎవరు?

Image
ఆమె పేరు మేరీ మల్లోన్.1869 సెప్టెంబర్ 23న ఐర్లాండ్ లో హుక్ స్టోన్ అనే గ్రామంలో జన్మించింది. 1883 లో యునైటెడ్ స్టేట్స్ కి వలస వచ్చింది . ఆమెకి వంట చేయడం చాలా ఇష్టం.అదే ఆమె వృత్తిగా చేసుకుంది.కాకపోతే ఆమె వండిన వంట తిన్నవారికి టైఫాయిడ్ వచ్చేది. కాబట్టి ఆమెకి టైఫాయిడ్ మేరీ అనే పేరు వచ్చింది. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటి అంటే ఆమెకి ఎప్పుడు టైఫాయిడ్ రాలేదు. టైఫాయిడ్ అప్పట్లో బాగా తీవ్రమైన వ్యాధిగా ఉండేది. 1900 లో టైఫాయిడ్ వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణాలు కనుగొన్నారు. బ్యాక్టీరియా వలన మరియు అపరిశుభ్రత వలన ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ అని తెలుసుకున్నారు. మేరీ మల్లోన్ టైఫాయిడ్ వ్యాప్తి చేసిన మొదటి మహిళగా గుర్తించబడింది. ఆమెకు టైఫాయిడ్ లేకపోయినా ఆమె వల టైఫాయిడ్ వ్యాప్తి చెందేది. కానీ దీనికి గల కారణం ఎవరి అంతుపట్టని విషయం. మరి మల్లోన్ కి కూడా ఈ విషయం మీద అవగాహన లేదు.అంటే మొదటిలో ఆమె ద్వారా టైఫాయిడ్ వ్యాప్తి జరుగుతుంది అని ఆమెకి కూడా తెలియదు. 1906 లో చార్లెస్ హెన్రీ వారెన్ అనే అతను ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. అతనిది సంపన్న కుటుంబం. న్యూయార్క్ లో...

చైనా వస్తువుల పై నిషేధం సాధ్యమా !?

Image
చైనా వస్తువులని నిషేదించాలి అనే నినాదం కొత్తది ఏమి కాదు. కొన్ని ఏళ్ళుగా ఎదో ఒక రకంగా చైనా మనదేశానికి వ్యతిరేకంగా పనులు చేస్తూ వచ్చింది. అది డోక్లామ్ వివాదం, చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం కానీ , ఈ మధ్య వచ్చిన వైరస్, ఇపుడు జరిగిన గాల్వాన్ వాలీ లో జరిగిన సంఘటనలు. ఇలా ఎన్నోరకాలుగా చైనా , భారత్ కి విరుద్ధంగా వ్యవహరించింది.అలాంటపుడు మనలో చైనా వస్తువులని బ్యాన్ చెయ్యాలి అనే నినాదం గుర్తుకొస్తుంది.  కానీ చైనా వస్తువులని బ్యాన్ చేయడం సాధ్యమేనా!? ఈ ప్రశ్నకి భిన్నమైన సమాధానాలున్నాయి. చైనా వస్తువులని బ్యాన్ చేసి , ఆ వస్తువులని వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుందాం అపుడు చైనా వ్యాపారం దెబ్బతింటుంది , వాళ్లకి నష్టం వస్తుంది కాబట్టి మనం చైనా వస్తువులని బ్యాన్ చేద్దాం అని మనలో చాలా మంది అనుకుంటారు. కానీ ఇది అంత సులువైన పని కాదు. ఇప్పటికిప్పుడు జరిగిపోయే చిన్న విషయం కూడా కాదు. ఎందుకంటే చైనా కి భారత్ కి మధ్య 2014 లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం జరిగే ఎగుమతి దిగుమతుల వ్యాపారం విలువ 74.8 బిలియన్ డాలర్స్ అనగా 5 లక్షల కోట్లు. ఇప్పటి లెక్కల ప్రకారం సుమారు 7 లక్షల కోట్లు....

ఆ 11 రోజులు ఎవరూ పుట్టలేదు, చనిపోలేదు.

Image
మనం ఏ పని మొదలుపెట్టిన కేలండర్ లో  ఒక మంచి రోజూ చూసుకొని మొదలు పెడతాం. అలాంటిది ఆ కేలండర్ లో కొన్ని తేదీలు కనిపించక పోతే కాదు కాదు అసలు లేకపోతే ఎలా ఉంటుంది. ఏంటి నమ్మడం లేదా!? ఐతే ఒకసారి 1752 వ సంవత్సరం సెప్టెంబర్ నెల క్యాలెండర్ ని గూగుల్ చేసి చూడండి. అందులో 2 వ తేదీ తరువాత 14 వ తేదీ ఉంటుంది. షాక్ అయ్యారా!?. ఇదేంటి 2వ తేదీ తరువాత 3 నుండి 13 వరకు ఉండే తేదీలు ఏమైపోయాయి అనుకుంటున్నారా..ఇది తప్పుడు కేలండర్ కాదు .ప్రింటింగ్ పొరపాటు అంతకంటే కాదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటానికి పట్టె కాలం ఒక సంవత్సరం అనగా 365 రోజులు అని మనం చిన్నపుడు పుస్తకాల్లో చదువుకున్నాం. 1582 వ సంవత్సరం లో  పొప్ 13వ గ్రెగొరీ అనే ఆయన ఈస్టర్ వచ్చే తేదీలలో తేడాని గమనించాడు.  అప్పట్లో అందరూ జ్యూసులిస్ సీజర్ కనిపెట్టిన జులియన్ క్యాలెండర్ ని ఉపయోగించేవారు.  ఆ క్యాలెండర్ ప్రకారం ఒక సంవత్సరానికి అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగి రాయటానికి పెట్టె కాలం 365 రోజుల 6 గంటలు.12 వ శతాబ్దం లో టలోమీ ప్రకారం, 16 వ శతాబ్దంలో కోపర్నికాస్, 17 వ శతాబ్దం లో కెప్లెర్  సిద్ధాంతాల ప్రకారం భూమి సూర్యు...

చందమామని చంపేద్దాం అనుకున్నారు !?

Image
అవును మీరు విన్నది నిజమే.చందమామని చంపేద్దాం అనుకున్నారు.ఇతనికేమైనా పిచ్చా! చందమామని చంపేయడం ఏంటి వీడి మొహం అనుకుంటున్నారా!?. "చందమామ రావే జాబిల్లి రావే " అని మనం పాడుకున్న ఆ చందమామని చంపేయడానికి ప్రయత్నాలు జరిగాయి. 1958 వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ దీనికి  ప్రాజెక్ట్ A119  అనే పేరుతో రహస్యంగా ఈ దారుణానికి ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం చంద్రుని మీదకి ఒక న్యూక్లియర్ బాంబు పంపించి , అక్కడ ఆ బాంబుని పేల్చడం. దీని ద్వారా చంద్రుడిని ముక్కలు ముక్కలుగా చేయటం. ఇది చంద్రుని వల్ల భూమికి ఆపద ఉంటుంది అనుకోని చేసిన ప్రయత్నం కాదు. ఇది కేవలం అమెరికా మరియు సోవియెట్ యూనియన్ రష్యా మధ్య ఆధిపత్య పోరులో భాగంగా చేయాలనుకున్న ఒక పిచ్చి పని. అప్పట్లో సోవియెట్ యూనియన్ రష్యా అంతరిక్ష పరిశోధనలో ముందంజలో ఉండేది. ప్రపంచం మొత్తం రష్యా వైపు చూడసాగాయి. అది చూసి తట్టుకోలేని అమెరికా చంద్రుడిని పేల్చేసి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలి అనుకుంది. లియోనార్డ్ రేఫల్ నాయకత్వంలోని పది మంది శాస్త్రవేత్తలు చికాగోలోని ఇల్లినాయిస్ ఇన్స్...

డిప్రెషన్ని దూరం చేద్దాం!

Image
"పాపం అతను ఫలాన రోగం వచ్చి చనిపొయడంట, ఫలానా ఆమె రోడ్ అక్సిడెంట్లొ చనిపొయిందంట" అని మనం చాలా సార్లు వింటునే ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఫలానావ్యక్తి డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నాడు అని తరచు వింటున్నాం. ఈ డిప్రెషన్ కి గొప్పవాళ్ళు ఏమీ అతీతులుకారు. అవునులే మనుషులకైతే ఆ భేదాలు. రోగాలకి, మృత్యువుకి ఆ భేదాలుండవుగా మరి. పని ఒత్తిడి, అంతేకాక ఒకరి లైఫ్ స్టైల్ మరొకరితో పోల్చుకుంటు అనవసరపు ఆలోచనల అగాధంలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. సామాజిక మాధ్యమాలలో వందలకొద్ది ఫ్రెండ్స్ ఉన్నా, మనసువిప్పి మాట్లాడుకోటానికి మన బాధలు చెప్పుకోటానికి ఒక్క మనిషి దొరకకపోవటం ఆలోచించాల్సిన విషయం. పెట్టిన ఫోటో కి లైక్స్ రాలేదని కొందరు, పక్కవాళ్ళులా బాగా బ్రతకాలేకపోతున్నాం అని ఇంకొందరు మనసులో ఆందోళన చెందుతున్నారు. కష్టానికి, భాదకి కొలమానం ఏముంటుంది.ఎవరి కష్టం వాళ్ళకి పెద్దదిగానే ఉంటుంది. కానీ మనలో సంతోషంగా బ్రతకాలి అనే ఆలోచన కన్నా, పక్కవాడి కంటే ఎక్కువ సంపాదించాలి అనే తపనే కనిపిస్తుంది. ఈ రేసులో అందరూ గెలవలేరు.అది అన్ని సార్లు కుదరకపోవచ్చు.ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. గెలవాలన...